Breaking
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హౌస్ అరెస్ట్
నంద్యాల జిల్లా పాములపాడు ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కర్నూలులోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి, నందికొట్కూరు వెళ్లకుండా అడ్డుకున్నట్లు సమాచారం.
పాములపాడు ఎంపీపీ స్థానంలో వైసీపీకి మెజారిటీ ఉన్నప్పటికీ, టీడీపీ నేతలు అక్రమ మార్గాల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి.
Comments
Loading comments...
