వార్తలకు తిరిగి వెళ్లండి
బైంసాలో 129 మంది లబ్ధిదారులకు రూ.36.13 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదివారం పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలకు సహాయనిధి అందించడమే లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఐదువేల మందికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సాయం అందించామని తెలిపారు.
వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఈ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. అవసరమైన వారు తనను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

