వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కుబీర్ మండలం పల్సి గ్రామ కరోబారి ఈర్ల భోజన్న (55) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. పది రోజుల క్రితం భోజన్న బైక్‌పై వెళ్తుండగా ఆవు అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు.
భైంసాలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. దీంతో పల్సి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Loading comments...

