Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్ అదుపుతప్పి కాలువలో పడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
Madhu Oct 02, 2026 1:50 PM ములుగుGeneral
బైక్ అదుపుతప్పి కాలువలో పడి వ్యక్తి మృతి - Udayam
కన్నాయిగూడెం మండలం గంగాగూడెం సమీపంలో గురువారం అర్ధరాత్రి బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న చిన్న కాలువలో పడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన తుమ్మ రమేష్ (48) బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న కన్నాయిగూడెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...