వార్తలకు తిరిగి వెళ్లండి

విజయపురం మండలంలోని పలు గ్రామీణ రహదారులు గుంతలమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలపాక కండ్రిగ–జీఎంపురం, ముత్యాలరెడ్డి కండ్రిగ–విజయపురం రహదారులు అధ్వానంగా ఉన్నాయి.
మంగళం చెరువుకట్ట, విజయపురం–కోసలనగరం, మహారాజపురం సాయిశక్తి ఇంజినీరింగ్ కళాశాల–కనకమ్మ సత్రం వరకు రహదారులు కూడా దెబ్బతిన్నాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

