వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో జంధ్యాల పౌర్ణమి, రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మశాలి కుల బాంధవుడైన మార్కండేయ మహర్షి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మశాలి కులస్తులు సామూహికంగా నూలు పోగులతో కూడిన జంధ్యాలను ధరించారు. అనంతరం కుల బాంధవులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

