వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం తోటలో భారీకొండ చిలువ సోమవారం ప్రత్యక్షమైంది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జ్యోతి నాయక్ అక్కడికి చేరుకున్నారు.
కొండచిలువ సుమారు 7 నుండి 8 ఫీట్ల పొడవు ఉంటదని తెలిపారు. కొండచిలువను పెద్దమ్మ అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెడతామని పేర్కొన్నారు. ఎవరికైనా విషపూరిత పాములు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

