Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో ఆరోగ్య కేంద్రం తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 4:44 PM బాపట్లGeneral
బాపట్లలో ఆరోగ్య కేంద్రం తనిఖీ - Udayam
బాపట్ల మండలం ఆసోదివారిపాలెంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని జిల్లా వైద్యాధికారి విజయమ్మ బుధవారం తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి, తల్లులు, పిల్లలకు సకాలంలో టీకాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. తదుపరి టీకాల కోసం పిల్లలను క్రమం తప్పకుండా ఆరోగ్య కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తనిఖీలో ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...