వార్తలకు తిరిగి వెళ్లండి
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ రైల్వేస్టేషన్‌లో వైన్‌గంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు రావడంతో గురువారం కలకలం రేగింది. రైల్లో బాంబు ఉందని లోకోపైలట్‌ను హెచ్చరించిన వ్యక్తి లగేజీ వదిలి పరారయ్యాడు.
అప్రమత్తమైన సిబ్బంది తనిఖీలు చేపట్టగా బాంబు లేదని తేలింది. దీంతో రైలు గంటన్నర ఆలస్యంగా బయలుదేరింది. లగేజీ కోసం తిరిగి వచ్చిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

