Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలస్వామిని నమ్మి మోసపోయాం: మాజీ మంత్రి రావె

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 12:11 AM గుంటూరుGeneral
రిటైర్డ్ రిజిస్ట్రేషన్ డీజీ బాలస్వామిని నమ్మి తాము దారుణంగా మోసపోయామని మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆరోపించారు. గుంటూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో తనకు రూ.50 లక్షలు ఇచ్చాననడం పచ్చి అబద్ధమని, సేఫ్‌వే ఇన్ఫ్రా సంస్థలో తన భార్యకు మాత్రమే పెట్టుబడులు ఉన్నాయని వివరించారు. తనపై చేసిన భూకబ్జా ఆరోపణలను ఖండిస్తూ, త్వరలోనే బాధితులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...