వార్తలకు తిరిగి వెళ్లండి

కొణిజర్ల మండలం చిన్నమునగాలలో విషాదం చోటుచేసుకుంది. ఇల్లెందుల రమేష్, మమత దంపతుల 9 నెలల కుమారుడు అవేద్ గురువారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు.
వర్షం కారణంగా ఎర్త్ పైపు స్టీల్ ప్లేట్ కు విద్యుత్ ప్రసారం కావడంతో దాన్ని పట్టుకున్న బాలుడు కుప్పకూలాడు. ఖమ్మం ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Loading comments...

