వార్తలకు తిరిగి వెళ్లండి

అవుకు మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు అవకాశం ఉందని ప్రిన్సిపల్ హేమీమా తెలిపారు. చదువు మధ్యలో ఆపేసినవారు, వివిధ కారణాలతో చదువు కొనసాగించలేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు.
ఓపెన్ ఇంటర్‌లో ప్రవేశానికి టెన్త్ అర్హత తప్పనిసరని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం కళాశాలను సందర్శించాలని సూచించారు.
Comments
Loading comments...

