వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ: ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ కార్యదర్శి ఎం. రవిచంద్ర డిమాండ్ చేశారు. ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.
2014కు ముందు వారిని రెగ్యులర్ చేయాలని అన్నారు. పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచి, జీతాలు చెల్లించాలని కోరారు. సెప్టెంబర్ 27న తిరుపతి సదస్సుకు ఉద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

