Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో వర్షపు నీటి గుంతలో ఇరుక్కున్న ఆటో

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 12:26 PM గుంటూరుGeneral
తాడేపల్లిలో వర్షపు నీటి గుంతలో ఇరుక్కున్న ఆటో - Udayam
తాడేపల్లి పాత జాతీయ రహదారిపై గురువారం రాత్రి కేబుల్ పనుల కోసం తీసిన గుంతలో వర్షపు నీరు చేరడంతో ఓ ఆటో ఇరుక్కుంది. రోడ్డు మార్జిన్ కనిపించకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఓ ప్రయాణికుడు కిందపడ్డాడు. స్థానికులు ట్రాక్టర్‌ సాయంతో అతికష్టం మీద ఆటోను బయటకు లాగారు. గుంత వద్ద భద్రతా చర్యలు చేపట్టకపోవడంపై ప్రయాణికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...