వార్తలకు తిరిగి వెళ్లండి

కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై తోలగంగనపల్లి సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఆటో ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం కడప నుంచి కమలాపురం వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన ఇద్దరు ప్రయాణికులను స్థానికులు 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు.
Comments
Loading comments...

