వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మాణ పనుల్లో ఉన్న ఒక బాలికపై శంభు బండారి అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతా లోపాలపై విమర్శలు వస్తుండగా, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

