Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెర్ప్ ఉద్యోగిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

Follow Udayam on Google
రాజేష్ Aug 19, 2026 11:20 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
సెర్ప్ ఉద్యోగిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి - Udayam
దుమ్ముగూడెం సెర్ప్ ఉద్యోగి గౌరారపు నరసింహారావుపై మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఉన్న ఆయనను బైక్‌పై అపహరించుకెళ్లి, ఊరి చివర పడేసి పరారైనట్లు పేర్కొన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. 100కు సమాచారం అందించి నరసింహారావును ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Comments

G
Loading comments...