వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా మమ్‌దోట్‌లో ఆప్ నేత గుర్‌ప్రీత్ సింగ్ గోపీని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఆయనను కారులో వెంబడించి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
పాత కక్షలే హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని, ఎన్నికల వివాదం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
Comments
Loading comments...

