వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధిలోని ఓ ఇంటి వద్ద అరుదైన అట్లాస్ మాత్ కనిపించింది. రెక్కలపై కళ్లలాంటి మచ్చలు, అంచుల్లో పాము తల ఆకారం ఉండే ఈ కీటకం రెక్కలు 20-25 సెంటీమీటర్ల వరకు విస్తరిస్తాయని పరిశోధకులు తెలిపారు.
ఇవి రాత్రిళ్లు మాత్రమే సంచరిస్తాయని, రెక్కలను ముడుచుకోకుండా ఎప్పుడూ విమానం ఆకారంలో విప్పుకొని ఉండటం అట్లాస్ మాత్ ప్రత్యేకతని పరిశోధకులు వివరించారు.
Comments
Loading comments...

