Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అతివేగంతో కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 11:10 AM బాపట్లGeneral
అతివేగంతో కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు - Udayam
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమలిపూరి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంతో అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...