Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సభకు వచ్చి ప్రశ్నించండి జగన్‌

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 6:38 AM అమరావతిGeneral
సభకు వచ్చి ప్రశ్నించండి జగన్‌ - Udayam
డీఎస్సీ సహా ఇతర అంశాలపై జగన్‌, వైకాపా ఎమ్మెల్యేలు బయట మాట్లాడకుండా అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెబుతుందని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లపై పేర్ని నాని తప్పుడు వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. లేనిపోని అపోహలు సృష్టిస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోనని హెచ్చరించారు.

Comments

G
Loading comments...