వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండల గూడెం గ్రామానికి చెందిన కోడప నరహరి (25) అనే యువకుడు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన నరహరి, సాయంత్రం అయినా తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పలగూడెం గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో నరహరి మృతదేహాన్ని గుర్తించారు.
మద్యం మత్తులో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మరణించి ఉంటాడని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు
Comments
Loading comments...

