Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా పతకమే లక్ష్యం: చాను

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 02, 2026 9:29 PM జాతీయంక్రీడలు
ఆసియా పతకమే లక్ష్యం: చాను - Udayam
కామన్వెల్త్‌ క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణం గెలిచిన భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సెప్టెంబరులో జరిగే ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే తన తదుపరి లక్ష్యమని చాను తెలిపింది. కామన్వెల్త్‌ విజయంతో బాధ్యత మరింత పెరిగిందని, గాయాలకు దూరంగా ఉంటూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తానని పేర్కొంది.

Comments

G
Loading comments...