Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిమియాలో కాల్పులు.. సైనికుడు సహా నలుగురు మృతి

Follow Udayam Digital on Google
రాజశేఖర్ రావు Aug 04, 2026 2:47 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
క్రిమియాలో కాల్పులు.. సైనికుడు సహా నలుగురు మృతి - Udayam Digital
క్రిమియాలో రష్యా సైనికుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. సహచర సైనికులపై కాల్పులు జరిపిన అనంతరం పౌరులపై కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడినట్లు సెవస్తోపోల్ ప్రాంత గవర్నర్ మిఖాయిల్ రజ్వొజాయేవ్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...