Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరవాడలో యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 03, 2026 5:12 PM అనకాపల్లి General
పరవాడలో యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు - Udayam
పరవాడ మండలం దిబ్బలగొర్లెవానిపాలెం సమీపంలో అనుమతులు లేకుండానే గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని చెబుతున్నారు. భారీ తవ్వకాలతో పెద్ద గోతులు ఏర్పడి ప్రజలు, పశువులకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలను అరికట్టాలని అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...