Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

52 గ్రామాల్లో ఆరో విడత రీసర్వేకు ఏర్పాట్లు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 04, 2026 6:20 PM పల్నాడు General
52 గ్రామాల్లో ఆరో విడత రీసర్వేకు ఏర్పాట్లు - Udayam
జిల్లాలో 52 గ్రామాల్లో 3,18,968 ఎకరాలకు ఆరో విడత రీసర్వే చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రీసర్వే పూర్తయ్యాక వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపు తప్పుల్లేని పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టి, అభ్యంతరాల పరిష్కారానికి 90 రోజుల గడువు ఇస్తారు. అనంతరం తుది భూ హక్కుల రికార్డులు సిద్ధం చేయనున్నారు.

Comments

G
Loading comments...