వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస పట్టణంలోని 8, 18 వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం పంపిణీ చేశారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లను ఇంటివద్దే అందజేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అర్హులెవరూ పథకాలకు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

