Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరేపల్లిలో స్వచ్ఛతకు సర్పంచ్‌ శ్రీకారం

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:07 AM కామరెడ్డిGeneral
అరేపల్లిలో స్వచ్ఛతకు సర్పంచ్‌ శ్రీకారం - Udayam
స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా నిజాంసాగర్‌ మండలం అరేపల్లిలో సర్పంచ్‌ నందాస్‌ మోహన్‌ స్వయంగా చీపురు పట్టారు. సిబ్బందితో కలిసి గ్రామంలోని ప్రధాన రహదారులను శుభ్రం చేసి, రోడ్లపై చెత్తాచెదారాన్ని తొలగించారు. గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్‌ అన్నారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...