Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పయ్యమ్మ వ్యాపారం ఎలా ఉంది ?

Follow Udayam on Google
B RAJESH Sep 17, 2026 8:33 PM విజయనగరంGeneral
గంటస్తంభం ప్రాంతంలో రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తున్న అప్పయ్యమ్మను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం ఆప్యాయంగా పలకరించారు. ఆమె వద్దకు వెళ్లి వ్యాపారం తీరుతెన్నులు, మొక్కజొన్నల కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వయంగా మొక్కజొన్న పొత్తులు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించారు. కలెక్టర్ సామాన్యుడిలా వ్యవహరించి మహిళతో ఆప్యాయంగా మాట్లాడిన తీరు స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...