Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 25, 2026 7:13 AM గుంటూరుGeneral
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య - Udayam
భార్య వైద్యం కోసం చేసిన రూ.9 లక్షల అప్పులు తీరకపోవడం, ఆరోగ్యం కూడా కుదుటపడకపోవడంతో మనస్తాపం చెందిన ఫిరంగిపురం రసూల్ పేటకు చెందిన జి.సంతోష్ కుమార్ (40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 20న ఇంట్లో గడ్డి మందు తాగిన ఆయన, గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశాడు. ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...