వార్తలకు తిరిగి వెళ్లండి

జక్రాన్‌పల్లి బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నిజాంపురం సాయన్న బుధవారం గేదెలను మేతకు తీసుకెళ్లాడు. వాటిని చెరువు నుంచి బయటకు తీసుకొచ్చే క్రమంలో అప్పల చెరువులోకి దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.
ఈతగాళ్లు గురువారం ఉదయం 5.30 గంటలకు మృతదేహాన్ని వెలికితీశారని ఎస్సై మహేష్ తెలిపారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

