వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత 'ఎక్స్' ఖాతా హ్యాక్

సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'లో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అకౌంట్ హ్యాక్ అయినట్లు అధికారులు తెలిపారు. ఆ ఖాతా నుంచి వస్తున్న అనధికారిక పోస్టులను ప్రజలు, మీడియా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
అకౌంట్ రికవరీ కోసం, హ్యాకర్లను గుర్తించేందుకు ఇప్పటికే ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఫాలోవర్లు ఎవరూ ఆ సందేశాలను పరిగణలోకి తీసుకోవద్దని కోరారు.
Comments
Loading comments...