వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేకుండా 8, 9వ తరగతులను నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదుపై బాన్సువాడ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో విద్యాశాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఏఐపీఎస్‌యూ చేసిన ఫిర్యాదు మేరకు మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాఠశాలకు వెళ్లి తరగతుల నిర్వహణ, అనుమతులకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.
సంబంధిత విద్యాశాఖ నుంచి 8, 9వ తరగతుల నిర్వహణకు అనుమతులు లేవని అధికారులు గుర్తించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

