Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేకుండా ర్యాలీలు,నిరసనలు చేయరాదు - ఎస్ఐ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 10, 2026 10:08 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
అనుమతులు లేకుండా ర్యాలీలు,నిరసనలు చేయరాదు - ఎస్ఐ - Udayam
పోలీసు శాఖ నుండి ఎటువంటి అనుమతులు లేని ర్యాలీలు,నిరసనలు నిర్వహించడం చట్టరీత్యా నేరం అని మెరకముడిదాం మండలంబుధరాయవలస ఎస్సై లోకేశ్‌ కుమార్‌ హెచ్చరించారు.సోమవారం చీపురుపల్లిలో వైసీపీ చేపడుతున్న ర్యాలీకి ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. ఈ మేరకు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ,సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసారు.నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...