వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం మండలం అంటిపేట వద్ద జాతీయ రహదారిపై గురువారం భారీ వృక్షం నేలకొరిగింది. సమాచారం అందుకున్న ఎస్సై హేమలత వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో చెట్టును రహదారి పక్కకు తొలగించారు.
దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించడంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

