Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్గత సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 02, 2026 9:13 AM మంచిర్యాలGeneral
అంతర్గత సస్యరక్షణ చర్యలు చేపట్టాలి - Udayam
దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాల రైతులు పంటలలో అంతర్గత సశ్య రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్ కోరారు. బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ మండలంలో రైతులు వేసిన పలు పంటలు ఎదుగుదశలో ఉన్నాయని తెలిపారు. ఆయా పంటలకు ఎరువులను వినియోగించాల్సి ఉంటుందన్నారు. గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగితే పంట ఎదుగుదలపై ప్రభావం ఉంటుందని, వాటిని ఎప్పటికప్పుడు తొలగించేలా రైతులు దృష్టి పెట్టాలని కోరారు.

Comments

G
Loading comments...