వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో మరో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారీ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ 120 ఎంఎంటీ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు పొందింది.
ఇప్పటికే గ్రీన్‌కో సంస్థ ఆధ్వర్యంలో ఓ గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు కానుంది. కొత్త ప్లాంట్ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైన రాయితీలకు కూడా అనుమతులు ఇచ్చింది.
Comments
Loading comments...

