Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లు

Follow Udayam on Google
Harika Sep 01, 2026 2:31 PM సూర్యాపేటGeneral
సూర్యాపేటలో మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లు - Udayam
చివ్వెంల మండలం ఉండ్రుగొండలో ఇందిరమ్మ ఇంటిని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు కాగా 70 శాతం పూర్తయ్యాయని చెప్పారు. రెండో విడతలో మరో 2,000 ఇళ్లు కేటాయిస్తున్నట్లు కొప్పుల వేణారెడ్డి వెల్లడించారు. అర్హులైన నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...