వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలోని నిత్య అన్నప్రసాదం ట్రస్ట్‌కు కేశనకుర్రుకు చెందిన మేక బంగారు సత్య భార్గవి రూ.42,361 విరాళంగా అందించారు. సోమవారం ఈ మొత్తాన్ని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ సూర్యనారాయణకు అందజేశారు.
ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఛైర్మన్ అందించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం పలకగా, ఈవో సత్యనారాయణ రాజు దాతను అభినందించారు.
Comments
Loading comments...

