వార్తలకు తిరిగి వెళ్లండి
సబ్బవరం మండలం ఇరువాడ హైవే పార్కింగ్ సమీపంలో శనివారం రాత్రి కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని ఎల్.కోట మండలానికి చెందిన పొట్నూరు గోపి 28గా గుర్తించారు.
ఈ ప్రమాదంలో అతడి కాలికి బలమైన గాయమైంది. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

