వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో నాయిని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో కళ్యాణోత్సవం జరిపారు.
మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Comments
Loading comments...

