వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తమతో లైన్‌మెన్ వెంకటయ్య అనుచితంగా మాట్లాడినట్లు బ్రాహ్మణపల్లి, బ్రాహ్మణపల్లి పెద్దతండా, గొట్లచెల్కతండా గ్రామస్థులు ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోవడంతో ఏడీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
దీంతో తమపై వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారని గ్రామస్థులు పేర్కొన్నారు. ఆయన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

