Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడిలో సీమంతాలు, అన్నప్రాసన వేడుకలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 04, 2026 4:17 PM జగిత్యాలGeneral
అంగన్వాడిలో సీమంతాలు, అన్నప్రాసన వేడుకలు - Udayam
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి 14వ వార్డు అంగన్వాడి కేంద్రంలో శనివారం సీమంతం, అన్నప్రాసన, టీహెచ్‌ఆర్ పంపిణీ నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ ధోనికెల శిరీష నవీన్ పాల్గొని గర్భిణీలకు, బాలింతలకు పలు సూచనలు చేశారు. ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన చేసి, బాలమృతం ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్‌వైజర్ ప్రతిభ, టీచర్ రజిని, వైద్య సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...