వార్తలకు తిరిగి వెళ్లండి

భీంపూర్ మండలంలోని అందర్బంద్ గ్రామంలో నాలి వ్యవస్థ అధ్వానంగా మారింది. పలుచోట్ల నాళీలు లేకపోగా, ఉన్న నాళీలు చెత్తాచెదారంతో కూరుకుపోయాయి. దీంతో మురుగు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పారిశుద్ధ్య లోపంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే నాళీలను శుభ్రం చేసి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

