Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబులెన్స్ లో సాధారణ ప్రసవం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 11, 2026 3:34 PM నాగర్ కర్నూల్General
అంబులెన్స్ లో సాధారణ ప్రసవం - Udayam
అమ్రాబాద్‌ మండలం లక్ష్మాపూర్‌ తండాకు చెందిన రామావత్‌ అలివేలు, వెంకటేశ్ దంపతులలో అలివేలుకు పురిటినొప్పులు రావడంతో అమ్రాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. కడుపులో శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. 108లో తీసుకెళ్తుండగా నొప్పులు అధికం కావడంతో ఈఎంటీ మల్లేశ్, పైలట్‌ గణేశ్ చాకచక్యంగా అంబులెన్స్‌లోనే సాధారణ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

Comments

G
Loading comments...