వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని హాస్టల్ తండా కు చెందిన కొమురె అనసూయ 108 అంబులెన్స్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని అంబులెన్స్ ఈఎంటి పైలెట్ మునీందర్ గౌడ్ తెలిపారు. అనసూయ పురిటి నొప్పులతో బాధపడుతుందని సమాచారం రావడంతో 108 అంబులెన్స్ తీసుకుని హాస్టల్ తండాకు వెళ్లడం జరిగిందన్నారు.
ఆమెను ఆసుపత్రికి తరలించే క్రమంలో అంబులెన్స్ లోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కాన్పు చేయగా, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందన్నారు.
Comments
Loading comments...

