వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల డా.బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో బుధవారం ఉచిత క్యాన్సర్ శిబిరం నిర్వహించారు. విశాఖ మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హారిక, డాక్టర్ హెబ్సిబా సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ పరీక్షలు చేశారు.
ఆరోగ్యకర జీవన విధానంతో క్యాన్సర్ను జయించవచ్చని వైద్యులు సూచించారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ కె.ఆర్.రజని, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అడ్డయ్య, ప్రిన్సిపల్ డాక్టర్ అనురాధ పాల్గొన్నారు.
Comments
Loading comments...

