Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ ఆశయాల సాధనకు పునరంకితం కావాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 24, 2026 5:39 PM జగిత్యాలGeneral
అంబేద్కర్ ఆశయాల సాధనకు పునరంకితం కావాలి - Udayam
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తహసీల్దార్ మహమ్మద్ మజీద్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ భారత ప్రజలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించిన మహానుభావుడని కొనియాడారు. కార్యక్రమంలో నామస్మరణ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక పాత్రికేయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...