వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ అధికారి మద్దిలి వినోద్‌బాబు మంగళవారం తెలిపారు. ఇదే చివరి అవకాశమని, ఇక గడువు పొడిగింపు ఉండదని పేర్కొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

