Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో చోరీ.. బంగారం, వెండి అపహరణ

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 07, 2026 5:20 PM అనకాపల్లి General
అనకాపల్లిలో చోరీ.. బంగారం, వెండి అపహరణ - Udayam
అనకాపల్లి గవరపాలెంలోని విజ్ఞాన సమితి వద్ద గురువారం అర్ధరాత్రి ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు బీరువాలోని 5.5 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.20 వేల నగదును అపహరించారు. పెంటకోట సత్యవతి కుటుంబ సభ్యులు మేడపై నిద్రిస్తున్న సమయంలో దుండగులు కింది గదిలోకి చొరబడినట్లు తెలిపారు. శుక్రవారం గుర్తించిన బాధితుల ఫిర్యాదుతో పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించి కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...